‘అందుకే హిందీ ‘జెర్సీ’ని వద్దనుకున్నా’

26 Mar, 2020 18:39 IST|Sakshi

నాని హీరోగా క్రికెట్‌ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన ‘జెర్సీ’ సినిమా అత్యంత ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను హిందీ రిమేక్‌లో బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు. ఇక హిందీ ‘జెర్సీ’లో షాహిద్‌కు జోడిగా పలు హీరోయిన్లను దర్శక నిర్మాతలు సంప్రదించినట్లు వార్తలు రావడంతో.. షాహిద్‌ సరసన నటించే ఆ హీరోయిన్‌ ఎవరబ్బాని అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చుశారు. ఇక చివరకూ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్‌ ప్రకటించింది. (రోహిత్‌ కోచ్‌తో షాహిద్‌ ట్రైనింగ్)

అయితే మొదట్లో ఈ సినిమా కోసం దక్షిణాది భామ రష్మికా మందన్నాను సంప్రందించగా ఆమె తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రిపబ్లిక్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రష్మీక దీనిపై స్పందించారు. ‘జెర్సీ’ అవకాశాన్ని వదులుకోవడానికి గల కారణాలను చెబుతూ.. ‘అవును నేను జెర్సీలో నటించాడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పటీ వరకూ  సినీ కేరీర్‌లో నేను ఎంపీక చేసుకునే సినిమాల ద్వారానే నాకు అవకాశాలు వచ్చాయి. అలా అని ‘జెర్సీ’ మంచి సినిమా కాదని కాదు. ఇప్పటి వరకూ నేను నటించినవన్ని కమర్షియల్‌ చిత్రాలే. షాహిద్‌ ‘జెర్సీ’ రియలిస్టిక్ చిత్రం. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.  ప్రస్తుతం నేను కమర్షియల్‌ చిత్రాల్లోనే నటించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. (షూటింగ్‌లో గాయపడ్డ హీరో)

#jersey #prep

A post shared by Shahid Kapoor (@shahidkapoor) on

అదే విధంగా ‘’ఒకవేళ నేను ఈ సినిమాకు సైన్‌ చేసి ఉంటే. ‘జెర్సీ’లోని నా పాత్ర ఎలాంటిదైనా దానికి న్యాయం చేసేదానిని కాదేమో. ఒక సినిమాలో నటిస్తున్నామంటే పూర్తిగా అందులో నిమగ్నమైపోవాలి. అంతే కాదు నా వల్ల ఆ సినిమాకు చెడ్డపేరు రావద్దని కూడ అనుకుంటాను. అందుకే ‘జెర్సీ’లో నటించడానికి ఒప్పుకోలేదు’’  అని వివరించారు. కాగా ఈ సినిమాలో షాహిద్‌ అత్యుత్తమ క్రికెటర్‌గా కనిపించడానికి విశేషంగా కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ నైపుణ్యాలను ప్రదర్శించడానికి టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ కోచ్‌ దినేష్‌ లాడ్‌ దగ్గర బ్యాట్‌ పట్టుకుని ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా