చిన్నప్పటి నుంచి విజయ్‌ అంటే క్రష్‌: రష్మిక

16 Feb, 2020 15:32 IST|Sakshi

హీరోయిన్‌ రష్మిక మందన్న వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్‌, సాండిల్‌వుడ్‌లో బిజీ హిరోయిన్‌గా మారారు. ఇటీవల సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సరసన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్‌ కొట్టడంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా మారారు. అదే విధంగా స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఓ సినిమాలోనూ రష్మికా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక తాజాగా హీరో నితిన్‌తో కలిసి నటించిన ‘భీష్మ’ విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. (ఘనంగా హీరో నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌)

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు అభిమాలను ఆకట్టుకోగా..  ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి ఈ అందాల భామ ‘భీష్మ’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక అసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మీకు ఎవరిపై క్రష్‌ ఉంది? భవిష్యత్తులో ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని యాంకర్‌ ప్రశ్నించారు. దీనిపై రష్మిక స్పందిస్తూ.. తనకు చిన్నతనం నుంచే ఇళయ దళపతి విజయ్‌పై క్రష్‌ ఉండేదని, భవిష్యత్తులో అతనితోనే నటించాలని ఉన్నట్లు తన మనసులో మాటను ఆమె వెల్లడించారు. గతంలో విజయ్‌ నటిస్తున్న ‘మాస్టర్‌’ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. (‘లవ్‌యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’)

చదవండి : నితిన్‌, రష్మికలకు థ్యాంక్స్‌: హృతిక్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు