జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక

22 Dec, 2019 16:49 IST|Sakshi

మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క‌్షన్ ప‌నులు ముమ్మరంగా జ‌రుగుతున్నాయి. తాజాగా రష్మిక తన పాత్రకు డబ్బింగ్ కూడా పూర్తిచేసింది.

డబ్బింగ్‌  చెప్పే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... తన ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తిచేసుకుందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని తెలిపింది. అందరిని ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా జనవరి 5న కలుసుకుంటానని తెలిపింది. జనవరి 11న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను వచ్చే ఏడాది జనవరి 5న భారీగా నిర్వహించాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. రామబ్రహ్మం సుంకర, ‘దిల్‌’ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషించారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

సినిమా

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’

‘నా భార్యకు హెల్ప్‌ చేస్తున్న జానీ సార్‌’

మీ నిస్వార్థ సేవకు సెల్యూట్‌: మహేశ్‌ బాబు