డైలాగ్స్‌ని రింగ్‌ టోన్స్‌గా పెట్టుకోవచ్చు

31 Dec, 2019 02:00 IST|Sakshi
పృథ్వీతో రమేష్, సిద్ధేశ్వర్‌

– పృథ్వీ

‘‘రథేరా’ టీజర్‌ చాలా బాగుంది. ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చిత్రం తరహాలో ‘రథేరా’ చిత్రం ఉండబోతోంది. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను రింగ్‌ టోన్స్‌గా పెట్టుకునేంత క్యాచీగా ఉన్నాయి. లోకల్‌ టాలెంట్‌తో అందరూ కొత్తవారు చేసిన ఈ సినిమా హిట్‌ అయ్యి అందరికీ మంచి పేరు రావాలి’’ అని నటుడు పృథ్వీ అన్నారు.  పూల సిద్ధేశ్వర్‌ రావ్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రథేరా’. జాకట రమేష్‌ దర్శకత్వంలో పూల సిద్ధేశ్వర్‌ రావ్, నరేష్‌ యాదవ్, వై.ఎస్‌.కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌కు నటుడు పృథ్వీ ప్రసంశలు అందించారు. ‘‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న మా సినిమా కొత్తగా ఉంటుంది’’ అన్నారు పూల సిద్ధేశ్వర్‌. ‘‘మా చిత్రాన్ని చూసిన కొందరు సినీ ప్రముఖులు బాగుందన్నారు.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా అదే మాట వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు జాకట రమేష్‌.    
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా

న్యూ కట్‌

భారీ విరాళం

సినిమా

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా

న్యూ కట్‌

భారీ విరాళం

మార్క్‌ బ్లమ్‌ ఇక లేరు