నయా సినిమా.. నయా లుక్‌

22 Feb, 2019 01:59 IST|Sakshi

తమిళంలో గతేడాది వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘రాక్షసన్‌’ ఒకటి. ప్రస్తుతం ఈ సస్పెన్స్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌వర్మ పెన్మత్స తెరకెక్కిస్తారు.  హవీష్‌ లక్ష్మణ్‌ కోనేరు బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. తొలి సన్నివేశానికి నిర్మాత కె.ఎల్‌.నారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేయగా హీరో హవీష్‌ క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా హవీష్‌ మాట్లాడుతూ – ‘‘రాక్షసన్‌’ చిత్రాన్ని తెలుగులో మా బ్యానర్‌పై నిర్మించడం సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా, భారీగా నిర్మించనున్నాం. ఈ సినిమా కోసం శ్రీనివాస్‌ తన లుక్‌ని మార్చుకోబోతున్నారు. గురువారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలైంది’’ అన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ నటించనున్నారని టాక్‌. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: వెంకట్‌ సి. దిలీప్‌.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

కమాండర్‌ విజయ్‌

సౌత్‌కి బదాయి హో

కష్టమంతా మరచిపోయాం

డబ్బు కోసం కాదు.. కథ నచ్చి చేశా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు