వాళ్లు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు: రవీనా

8 Jul, 2020 20:46 IST|Sakshi

తమ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ అన్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇటీవల బాలీవుడ్‌ సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ వాదన ఉవ్వెత్తున లేచింది. నెపోటిజమ్‌ కారణంగానే సుశాంత్‌ చనిపోయాడని అతని అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖ నటులు సైతం గళం విప్పుతున్నారు. సుశాంత్‌ మరణించి 20 రోజులు దాటుతున్న బంధుప్రీతిపై చర్చలు మాత్రం చల్లారడం లేదు. (మెగాస్టార్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ?)

దీనిపై తాజాగా నటి రవీనా టండన్‌ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఉంది. అందుకు నేను అంగీకరిస్తున్నాను. ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వీరిలో చెడ్డవాళ్లు మిమ్మల్ని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు క్లాస్‌రూమ్‌లో చేసే చిల్లర రాజకీయాల్లాంటివి. కానీ ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయితే మేము గ్లామరస్‌ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్‌ అవుతోంది’. అని రవీనా అన్నారు. అంతేగాక సుశాంత్‌ మరణాన్ని సంచలనం చేయడం ఆపేయాలని ఆమె కోరారు. (ర‌వీనా.. న‌న్ను పెళ్లి చేసుకుంటారా?)

మరిన్ని వార్తలు