ఆ హీరోకు బిల్డర్‌ టోకరా..

3 Dec, 2018 19:21 IST|Sakshi
భోజ్‌పురి మెగాస్టార్‌ రవికిషన్‌ (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ : పలు బాలీవుడ్‌ సినిమాలు, టీవీ షోల్లో నటించిన భోజ్‌పురి సినిమా మెగాస్టార్‌ రవికిషన్‌ ఓ బిల్డర్‌ చేతిలో మోసపోయారు. ముంబైలో రూ 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్‌ను బుక్‌ చేసిన రవికిషన్‌కు ఇంతవరకూ బిల్డర్‌ ఫ్లాట్‌ను అప్పగించకపోవడంతో నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని కమలా ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ బిల్డర్స్‌ వద్ద రూ 1.5 కోట్లు చెల్లించి ఫ్లాట్‌ బుక్‌ చేసుకున్న రవికిషన్‌కు ఇప్పటివరకూ బిల్డర్లు ఫ్లాట్‌ను అప్పగించలేదు.

కమలా ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ బిల్డర్లు జితేంద్ర జైన్‌, జినేంద్ర జైన్‌, కేతన్‌ షాలపై రవికిషన్‌ ఫిర్యాదు చేశారు. సునీల్‌ నాయర్‌ అనే వ్యక్తిని కూడా బిల్డర్లు రూ 6.5 కోట్ల మేర మోసగించినట్టు ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. కమలా ల్యాండ్‌మార్క్‌ గ్రూప్‌ మరో నిర్మాణ రంగ సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన జేవీ గ్రూప్‌ ఫిర్యాదుదారులు ఇద్దరికీ కలిపి రూ 8 కోట్ల మేర టోకరా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు