డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

7 Nov, 2019 20:18 IST|Sakshi

మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై రవితేజతో పాటు ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టికున్నారు. ఇప్పటికే విడుదలైన రవితేజ గ్రాఫిక్‌ పోస్టర్‌, బాబీ సింహ లుక్‌, లిరికల్‌ సాంగ్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. 

అయితే సినిమా విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రవితేజ అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. అయితే మాస్‌ మహారాజ్‌ అభిమానులకు చిత్ర యూనిట్‌ తీపి కబురు చెప్పింది. ‘డిస్కో రాజా’  వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌టీ తన అధికారిక ట్విటర్‌లో తెలిపింది. దీనికి డేట్‌ గర్తుపెట్టుకోండి అంటూ రవితేజ రీట్వీట్‌ చేశాడు. దీంతో జనవరి 24న డిస్కోరాజాతో రవితేజ థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు కన్ఫార్మ్‌ అయింది. 

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉందని తెలిసిందే. అయితే అనుకున్న రీతిలో అవుట్‌పుట్‌ రాకపోవడంతో చిత్ర యూనిట్‌ సినిమా విడుదలను పలుమార్లు వాయిదా వేసింది. దీంతో ఈ సినిమా వచ్చే వేసవి ప్రారంభంలో విడుదుల కావచ్చనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. అబ్బూరి రవి మాటలు​ అందిస్తున్నాడు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!

తెలుగు తెరపై ‘త్రివిక్రమ్‌’ మాటల మంత్రం

అతనే నా మొదటి ప్రియుడు: నటి

వేడుక చేద్దాం.. లవ్‌ యూ పప్పా: శృతిహాసన్‌

ఫిఫ్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..

ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్‌

ఆ కాంబినేషన్‌ ఇప్పుడు సెట్‌ కానుందా?

ప్రేమ కాదు ఫ్రెండ్‌షిప్పే!

నా గొంతు వినండి

అంతా నిశ్శబ్దం

ప్రేమతోనే సమస్య

నాలుగేళ్లకు మళ్లీ!

మామా అల్లుడి పాటల సందడి

చెల్లెలి కోసం...

మళ్లీ మళ్లీ రాని అవకాశం

సమయానికి వస్తాను... చెప్పింది చేస్తాను

కనెక్ట్‌ అయిపోతారు

‘జార్జ్‌రెడ్డి’ లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రోమో

తల్లిదండ్రుల విడాకులపై స్పందించిన శ్రుతి హాసన్‌

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌