ఇంకో రాణి ఎవరు?

5 Jun, 2019 02:35 IST|Sakshi

డిస్కో రాజా ఫుల్‌ జోష్‌గా ఉన్నాడు. ఎర్రటి ఎండల్లో హుషారుగా షూటింగ్‌ చేస్తున్నాడు. డిస్కో రాజా అంటే రవితేజ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌ ‘డిస్కో రాజా’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌ కూడా మొదలైంది. డిస్కో రాజా సరసన ముగ్గురు రాణులు కనిపిస్తారు. ఒకరు నభా నటేష్‌. ఇంకో హీరోయిన్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. మరో హీరోయిన్‌ ఎంపిక జరుగుతోంది. మరి.. ఇంకో రాణిగా ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కి మంచి స్పందన లభించిందని చిత్రబృందం పేర్కొంది.

మరిన్ని వార్తలు