సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాజా ది గ్రేట్'

14 Oct, 2017 14:16 IST|Sakshi

చాలా రోజుల విరామం తరువాత సీనియర్ హీరో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

రవితేజ మార్క్ మాస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సాయి కార్తీక్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా సక్సెస్ మీద కూడా చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు