కృష్ణదేవరాయల హారం కహానీ

2 Nov, 2017 01:24 IST|Sakshi

కౌశిక్‌ బాబు, వరుణ్‌ సందేశ్, వితికా షేరు, షీనా (బిందాస్‌ ఫేమ్‌) ప్రధాన తారలుగా రూపొందిన సినిమా ‘రాయల హారం’. కర్రి బాలాజీ దర్శకత్వంలో శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్‌ పతాకంపై జి.ఎల్‌.బి శ్రీనివాస్‌–నూకల లక్ష్మణ సంతోష్‌కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని, పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది.

కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి ఓ హారం ప్రధానాంశంగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి అధిక ప్రాధాన్యమిస్తూ వినోదాన్ని మేళవించాం. కృష్ణదేవరాయలుగా కౌశిక్‌ బాబు పాత్ర అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే ఫస్ట్‌ లుక్, ఆడియో రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. ముక్తార్‌ ఖాన్, ధనరాజ్, ఫిష్‌ వెంకట్, చక్రవర్తి తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: కర్ణ, సంగీతం: శ్రీవత్స–మీనాక్షీ–నాగరాజు–ప్రణవ్, సమర్పణ: ఎం.ఏ.చౌదరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు