రాయలసీమ ప్రేమకథ

13 Sep, 2019 02:29 IST|Sakshi
పావని, వెంకట్

‘‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ట్రైలర్‌లో ‘ఇడియట్‌’ సినిమా యాటిట్యూడ్‌ కనపడుతోంది. కర్నూల్‌లో షూట్‌ చేసిన ఏ సినిమా అయినా హిట్‌ అవుతుందనే సెంటిమెంట్‌ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది కర్నూల్‌ నేపథ్యంలో వస్తున్న ‘రాయలసీమ లవ్‌స్టోరీ’ ఇంకెంత హిట్‌ అవుతుందో ఊహించుకోవచ్చు. రామ్‌లో మంచి ప్రతిభ, పవర్‌ కనపడుతున్నాయి. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ మంచి భవిష్యత్‌ ఉండాలి’’ అని డైరెక్టర్‌ జి.నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు.

వెంకట్, హృశాలి, పావని ప్రధాన పాత్రల్లో రణధీర్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరీ’. రాయల్‌ చిన్నా, నాగరాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్, ఆడియో బిగ్‌ సీడీలను జి.నాగేశ్వర్‌ రెడ్డి ఆవిష్కరించారు. రామ్‌ రణధీర్‌ మాట్లాడుతూ– ‘‘మొదటి నుంచి మమ్మల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన నాగేశ్వర్‌ రెడ్డిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఒక్క లైన్‌ చెప్పగానే నన్ను నమ్మి పది రోజుల్లోనే షూటింగ్‌ స్టార్ట్‌ చేయించారు నిర్మాతలు. వారు నాకు జీవితం ఇచ్చారు. కథకు తగ్గ కరెక్ట్‌ టైటిల్‌ ‘రాయలసీమ లవ్‌స్టోరీ’’ అన్నారు.

‘‘రాయలసీమ అనగానే అందరికీ బాంబులు, ఫ్యాక్షన్‌ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ వాళ్ల ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేయడానికే ఈ చిత్రం నిర్మించాం’’  అన్నారు రాయల్‌ చిన్నా. ‘‘అను కున్న సమయానికి సినిమా పూర్తయింది. ఔట్‌పుట్‌ కూడా బాగా వచ్చింది. ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు నాగరాజు. ‘‘నిర్మాతల సహకారం వల్లే మ్యూజిక్‌ ఇంత బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు సాయి ఎలేంద్ర. వెంకట్, హృశాలి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ మహేందర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లవ్‌ బాస్కెట్‌లో...

ఓనమ్‌ వచ్చెను చూడు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

మెగా హీరోతో ఇస్మార్ట్ హీరోయిన్‌

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి

ఆ టెన్షన్‌లో కిక్‌ ఉంటుంది

‘కాలా’ను విడుదల చేయొద్దు

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు