ఆర్‌డీఎక్స్‌ రెడీ

17 Sep, 2019 00:25 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్, తేజస్‌ కంచర్ల జంటగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’. రామ్‌ మునీష్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాని అక్టోబర్‌ 11న విడుదల చేయనున్నారు. ‘‘తన ఊరితో పాటు చుట్టుపక్కల గ్రామాల ఆశయ సాధన కోసం ఓ అమ్మాయి ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి స్పందన వచ్చింది.

ట్రైలర్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు, డైలాగ్స్‌తో పాయల్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 11న విడుదల కానున్న మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్‌ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్యశ్రీ, సాహితీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిన్నా, సంగీతం: రధన్, కెమెరా: సి.రాంప్రసాద్‌.

మరిన్ని వార్తలు