మరో ఆఫర్‌

12 Sep, 2017 04:41 IST|Sakshi
మరో ఆఫర్‌

తమిళసినిమా:  పెళ్లిచూపులు చిత్ర కథానాయకి రీతూవర్మకు కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. తమిళంలో వీఐపీ–2 చిత్రం ద్వారా చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలంగాణ పోరి ప్రస్తుతం విక్రమ్‌కు జంటగా నటిస్తున్న ధ్రువనక్షత్రం చిత్రంపై చాలా ఆశలనే పెటుకుంది. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం టర్కీలో మకాం పెట్టిన రీతూవర్మ చిన్న అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. తాజాగా మరో లక్కీ ఆఫర్‌ను దక్కించుకుంది. నటుడు దుల్కర్‌ సల్మాన్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఈ బ్యూటీని వరించిందన్న తాజా సమాచారం.

డేసింగ్‌ పెరియస్వామి దర్శకత్వంలో దుల్కర్‌సల్మాన్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటి రీతూవర్మను ఎంపిక చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో రీతూవర్మ సోలో హీరోయిన్‌గా నటించనుంది. కాగా ప్రస్తుతం దుల్కర్‌సల్మాన్‌ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. అది పూర్తి కాగానే అక్టోబరులో ప్రారంభం కానున్న డేసింగ్‌ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించనున్నారు. ఈలోగా నటి రీతూవర్మ ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసుకుంటుందట. కాగా ఈ భామ తెలుగులోనూ బిజీగానే నటిస్తోందన్నది గమనార్హం. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతోందన్న మాట.