బాలీవుడ్‌కి  హాయ్‌

11 Apr, 2018 01:23 IST|Sakshi

సౌత్‌లో మంచి నటిగా ప్రూవ్‌ చేసుకున్నారు కథానాయిక రెజీనా. సౌత్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోల సరసన  నటించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్‌పై కన్నేశారు. అదేనండీ.. బాలీవుడ్‌ నుంచి కాలింగ్‌ అందుకుని షూట్లో జాయినైపోయారని బీటౌన్‌ టాక్‌. అనిల్‌ కపూర్‌ హీరోగా నటించిన ‘1942: ఏ లవ్‌స్టోరీ’ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో.. అందులోని ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ సాంగ్‌ అంతకు మించి ఫేమస్‌. ఇప్పుడు ఈ సాంగ్‌ టైటిల్‌తోనే ఓ సినిమా రూపొందుతోంది.

షెల్లీ చోప్రా దర్వకత్వంలో అనిల్‌కపూర్, సోనమ్‌ కపూర్, రాజ్‌కుమార్‌ రావు, రెజీనా, జూహ్లీ చావ్లా ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’. ఈ సినిమా షూటింగ్‌లో రెజీనా జాయిన్‌ అయ్యారట. హిందీ చిత్రం ‘అన్కేన్‌’ సీక్వెల్‌ ‘అన్కేన్‌ 2’ తో రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారని అప్పట్లో వార్తలొచ్చినా కుదుర్లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో ‘ఏక్‌ లడ్కీ కో దేఖాతో ఏశా లగా’ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు