నో డూప్‌

14 Jan, 2020 02:11 IST|Sakshi
అక్షర గౌడ, రెజీనా

ఓ మిస్టరీని ఛేదించడాని సిద్ధమయ్యారు రెజీనా. మరి ఆ ప్రయాణంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తెలియడానికి ఇంకా సమయం ఉంది. తమిళ దర్శకుడు కార్తీక్‌ రాజు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం చేయడానికి అంగీకరించారు రెజీనా. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌శేఖర్‌ వర్మ నిర్మించనున్నారు. తమిళనాడులో చిత్రీకరణ కూడా ప్రారంభించారు చిత్రబృందం. కన్నడ హీరోయిన్‌ అక్షర గౌడ ఈ సినిమాలో కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో యాక్షన్‌ కూడా ఉండబోతోందట. రెజీనా డూప్‌ లేకుండా ఫైట్స్‌ చేయనున్నారని సమాచారం. ఇందుకోసం శిక్షణ కూడా ప్రారంభించారట.

మరిన్ని వార్తలు