జ్యోతిష్యం చెబుతా 

2 Jan, 2020 01:30 IST|Sakshi

చేతిని చూసి మీకు జరగబోయేదేంటో జోష్యం చెబుతాను అంటున్నారు రెజీనా. అనడమే కాదు.. జోష్యానికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా అవగాహన చేసుకుంటున్నారు. ఇదంతా తన తదుపరి సినిమాలోని పాత్రకు సంబంధించిన ప్రాక్టీస్‌ అని అర్థం చేసుకోవచ్చు. ‘ఎవరు’ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు రెజీనా. ఇటీవలే తమిళంలో ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాను అంగీకరించారు. ఇందులో అక్షర గౌడ మరో హీరోయిన్‌. కార్తీక్‌ రాజు దర్శకుడు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను ఈ సినిమాలో చూపించనున్నారట. ‘‘ఈ సినిమాలో నేను జ్యోతిష్కురాలి పాత్రలో కనిపిస్తాను. డైరెక్టర్‌ నాకు ఈ కథ చెప్పాగానే బాగా కనెక్ట్‌ అయ్యాను’’ అని పేర్కొన్నారు రెజీనా. జనవరి 10 నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. 

మరిన్ని వార్తలు