దెయ్యంగా మారిన రెజీనా

30 Mar, 2016 02:08 IST|Sakshi
దెయ్యంగా మారిన రెజీనా

దెయ్యంగా ఇక నటి రెజీనా వంతు వచ్చింది. ఇప్పటికే నయనతార, త్రిష, హన్సిక, ఆండ్రియా లాంటి ప్రముఖ తారలందరూ హారర్ చిత్రాలలో దెయ్యాలుగా నటించి సక్సెస్ అయ్యారు. తాజాగా నటి రెజీనా కూడా రెయ్యంగా మారిపోయింది. ఈ అమ్మడు దెయ్యంగా నటిస్తున్న చిత్రం నెంజం మరప్పదిల్లై. ఇంతకు ముందు కేడీబిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజమందిరం తదితర చిత్రాలలో నటించిన రెజీనా ఆ తరువాత తన దృష్టిని టాలీవుడ్‌పైకి మరల్చింది.
 
 అక్కడ సాయి ధరమ్‌తేజ్ తదితర యువ నటులతో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనూహ్యంగా ఇప్పుడు మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతోంది. తమిళంలో నెంజం మరప్పదిల్లై, మానగరం, రాజతందిరం-2 మొదలగు మూడు చిత్రాలలో నటిస్తోంది. సంచలన దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం నెంజం మరప్పదిల్లై. నాటి ఆణిముత్యం లాంటి పాట పల్లవిని టైటిల్‌గా నిర్ణయించి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య కథానాయకుడిగా నటిస్తున్నారు.
 
 ఇందులో కథానాయికలుగా రెజీనా, నందిని నటిస్తున్నారు. నటి రెజీనా ఈ చిత్రంలో తొలి సారిగా దెయ్యంగా నటించడం విశేషం. ఇందులో ఒక పాటలో ఈ అమ్మడు పలు గెటప్‌లలో భయపెట్టనుందట. ఈ పాటను ఆరు రోజుల పాటు చిత్రీకరించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ హారర్ కథా చిత్రంలో రెజీనా కు ప్రాధాన్యం ఉన్న పాత్ర అట.తెలుగులోనూ మంచి మర్కెట్ ఉండడంతో దర్శకుడు సెల్వరాఘవన్ నటి రెజీనాను దెయ్యం పాత్రకు ఎంపిక చేశారని సమాచారం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి