స్పెషల్‌ రోల్‌

31 Aug, 2019 00:03 IST|Sakshi
రెజీనా

టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఏర్పడే అనర్థాలను చూపిస్తూ విశాల్‌ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) తీశారు. పీయస్‌ మిత్రన్‌ తీసిన ఈ సినిమా సూపర్‌ హిట్‌. ఈ సినిమాకు సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఎళిల్‌ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్‌లో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో రెజీనా కనిపిస్తారని సమాచారం. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని తెలిసింది. విశాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా