లెక్క తప్పింది

10 Aug, 2017 02:07 IST|Sakshi
లెక్క తప్పింది

తమిళసినిమా: లెక్క తప్పిందన్న మనస్తాపంలో మునిగిపోయిందట రెజీనా . అనుకున్నవన్నీ జరిగితే ఇక దేవుడెందుకు అనే సామెత గుర్తుకొస్తోంది రెజీనా పరిస్థితి చూస్తే. నిజానికి ఈ బ్యూటీ మంచి ఫామ్‌లోనే ఉంది. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ గానే ఉంది. అయితే ఇటీవల రెజీనాకు గ్లామర్‌పై మోజు పుట్టి నక్షత్రం అనే తెలుగు చిత్రం లో విచ్చల విడిగా అందాలను ఆరబోసింది. దీంతో స్టార్‌ హీరోయిన్‌ స్థాయి ఖాయం అని సన్నిహితులు చేవిలో బాజా ఊదడంతో చాలానే కలలు కనేసిందట.

అయితే ఆ చిత్రం నిరాశ పరచడంతో ఇప్పుడు ఊహల పల్లకిలోంచి దబాల్న ఇహలోకంలోకొచ్చిందట. మితి మించిన గ్లామర్‌గా నటించినా ఫలితం దక్కకపోవడంతో లెక్క తప్పిందని చింతిస్తోందట. ఇకపై అలాంటి పొరపాటు చేయరాద న్న నిర్ణయానికి వచ్చేసిందట. కాగా ప్రస్తు తం ఈ అమ్మడు కోలీవుడ్‌లో సిల్లుక్కువార్‌పట్టి సింగం, నెంజమ్‌ మరప్పదిల్లై, రాజతంధిరం–2,పార్టీ అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉం ది. వీటిలో ఏ రెండు చిత్రాలు విజయం సాధించినా త న మార్కెట్‌ పదిలంగా ఉంటుందని రెజీనా భావిస్తోందట.