సత్యమూర్తి గేమ్‌

23 May, 2017 01:33 IST|Sakshi
సత్యమూర్తి గేమ్‌

‘గోవిందుడు అందరివాడేలే’, ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన రెహమాన్‌ తమిళంలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను, హీరోగానూ నటిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ధృవంగళ్‌ పదినారు’ అనే తమిళ చిత్రం తెలుగులో ‘16’ పేరుతో ఇటీవల విడుదలై, విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజాగా రెహమాన్‌ హీరోగా నటించిన ఓ తమిళ మూవీ తెలుగులో ‘డా. సత్యమూర్తి’ పేరుతో విడుదల కానుంది. యశ్వంత్‌ మూవీస్‌ పతాకంపై డి.వెంకటేశ్‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఆర్‌. సెంథిల్‌నాదన్‌ దర్శకుడు. ‘‘ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ. సత్యమూర్తి ఎలాంటి గేమ్‌ ఆడాడనేది ఆసక్తిగా ఉంటుంది. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని డి. వెంకటేశ్‌ తెలిపారు. సురేష్, అతిధీ గురురాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శరవణ పాండియన్, సంగీతం: ప్రేమ్‌కుమార్‌.