ఒక్క నిమిషం!

26 Jan, 2018 00:53 IST|Sakshi
నిక్కీ గల్రాని, శ్రియ

ఒక్క నిమిషం.. అంటే 60 సెకన్లు్ల.. ఒకే ఒక్క నిమిషంలో ఏం చేయగలం? అంటే.. తలచుకుంటే ఏమైనా చేయొచ్చు. మంచి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అదే చేశారు హీరోయిన్లు శ్రియ, నిక్కీ గల్రాని. ‘‘న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? నేనైతే రోజులో కనీసం ఒక్క నిమిషమైనా యోగ చేయాలనుకుంటున్నా. డైలీ యోగ చేయడాన్ని మర్చిపోలేని అలవాటుగా మార్చుకోవాలని డిసైడ్‌ అయ్యాను’’  అన్నారు శ్రియ. అయితే ఒక్క నిమిషంలో ఏ ఆసనం వేస్తారో మాత్రం చెప్పలేదు. ఇక నిక్కీ గల్రాని కూడా సేమ్‌ శ్రియ తీసుకున్న నిర్ణయాన్నే తీసుకున్నారు.

ఆమె కూడా యోగా చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ముఖ్యంగా ప్రాణాయామం చేయాలని ఫిక్సయ్యారట. ‘‘ఈ సంవత్సరం ప్రతి రోజూ కనీసం ఒక్క నిమిషమైనా ప్రాణాయామం ప్రాక్టీస్‌ చేస్తా. మీరూ ఓ మంచి నిర్ణయం తీసుకోండి’’ అన్నారు నిక్కీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. నిక్కీకి ఫిబ్రవరి 9 సూపర్‌ డే. ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు చిత్రాలు ‘కీ, కలకలప్పు–2’ ఆ రోజునే విడుదల కానున్నాయి. సో..ఆ రోజు నిక్కీ ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా అన్నమాట.

మరిన్ని వార్తలు