విజయదశమికి రెక్క

22 Aug, 2016 02:25 IST|Sakshi
విజయదశమికి రెక్క

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాకు ప్రచారం చాలా అవసరం. అయితే అలాంటి ప్రచారాన్ని ప్రారంభించకుండానే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి వాటిలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం రెక్క. అందుకు ఈ చిత్ర కథానాయకుడు విజయ్‌సేతుపతి ఒక కారణం కావచ్చు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈయన నటిస్తున్న తాజా చిత్రం రెక్క.
 
 ఆయనకు జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. రతన్‌శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కామన్‌మ్మాన్ ప్రెజెంట్స్ పతాకంపై బి.గణేశ్ నిర్మిస్తుండగా డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు రతన్‌శివ తెలుపుతూ విజయ్‌సేతుపతి పర్ఫార్మెన్స్ నటుడిగానే అందరికీ తెలుసన్నారు. అలాంటి ఆయన్ని రెక్క చిత్రం పక్కా యాక్షన్  హీరోగా చూపిస్తుందన్నారు.
 
 ఇందులో ఆయన కుంభకోణానికి చెందిన యువకుడిగా నటించ గా నటి లక్ష్మీమీనన్ మదురై అమ్మాయిగా నటించారన్నారు. చిత్రం పేరుకు తగ్గట్టుగానే మదురై, కుంభకోణం, కారైకుడి, బ్యాంకాక్‌లను చుట్టి చిత్రీకరణను పూర్తి చేసుకుందని తెలిపారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్ర హక్కులను సొంతం చేసుకున్న శివబాలన్ పిక్చర్స్ అధినేత అక్టోబర్‌లో ఆయుధపూజ సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రానికి సుభా గణేశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి