పాడడమే నాకిష్టం

10 Oct, 2017 05:29 IST|Sakshi

తమిళసినిమా: నటి రమ్యానంబీశన్‌ది మంచి ఫిజిక్‌. చూడ సక్కని అందం. మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ మలయాళీ బ్యూటీకి తమిళంలో పిజ్జా, సేతుపతి వంటి హిట్‌ చిత్రాలు ఉన్నాయి. అయినా ఎందుకో తనకు పాడడం అంటేనే చాలా ఇష్టం అంటోంది. ఈ ముద్దుగుమ్మ తమిళంలో తొలిసారిగా పాడిన ఫైఫైఫై అనే పాట యువతను ఉర్రూతలూగించింది.అక్కడి నుంచి గాయనిగా రాణించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఇప్పటికే మాతృభాషలో 20 వరకూ పాటలు పాడేసిన రమ్యానంబీశన్‌కు కోలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్నాయట. సిబిరాజ్‌ హీరోగా, వరలక్ష్మీ శరత్‌కుమార్, తాను హీరోయిన్లుగా నటిస్తున్న సత్య చిత్రం కోసం ఇటీవల ఒక పాట పాడిందట. ఈ పాట వినగానే తానే పాడాలనిపించిందట.

అదే విషయాన్ని చిత్ర హీరో సిబిరాజ్‌కు, సంగీత దర్శకుడు సీమోన్‌ కే.కింగ్‌కు చెప్పగా వారిద్దరూ ఒకే అనడంతో స్టూడియోకు వెళ్లి పాడానని, ఆ పాట తనతో పాటు చిత్ర యూనిట్‌ అందరికీ తెగ నచ్చేసిందంటున్న రమ్యానంబీశన్‌ ఇలాంటివి బోలెడన్ని పాడాలని ఆశపడుతోందట. సింగర్‌గా తానింకా ప్రారంభ దశలోనే ఉన్నానని, సినిమా పాటలకే పరిమితం కాకుండా ఇండిపెండెంట్‌ పాటలను పాడాలని కోరుకుంటున్నానని అంది. ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రం సత్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతుండగా మెర్కురీ అనే మరో చిత్రంలోనూ నాయకిగా నటిస్తోంది. అదే విధంగా కన్నడంలో కురుక్షేత్రం అనే పురాణ ఇతిహాసం మహాభారతం కథా చిత్రంలో నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా