చిత్రపరిశ్రమలో మరో విషాదం, సీనియర్‌ నటుడు మృతి

21 Jul, 2020 08:45 IST|Sakshi

భువనేశ్వర్‌: 2020 చిత్ర సీమకు అస్సలు కలిసి రాలేదనే చెప్పాలి. ఏడాది మొదలు నుంచి సినీ పరిశ్రమలో ఏదో మూల ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.  తాజాగా ఒడియా సీనియర్‌ నటుడు బిజయ్ మొహంతి(70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంత కాలంగా మొహంతి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన సోమవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. మొహంతి మృతి పట్ల ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పలువురు ఒడియాకు చెందిన పలువురు సినీ కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

చిత్ర పరిశ్రమలో మొహంతి వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొనియాడారు. మొహంతి మరణంతో ఒడియా చిత్ర సీమలో ఒక శకం ముగిసిందన్నారు.ఆయన మరణం చిత్రసీమలో తరగని అంతరాన్ని కలిగించిందన్నారు. ఆయన అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు.

చదవండి: సీనియ‌ర్ న‌టుడిని పొట్ట‌న‌పెట్టుకున్న క‌రోనా


 ఇక ఒడిశాకే చెందిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, బిజయ్ మొహంతిని కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో శ్రీ జగన్నాథ స్వామి ఆయన కుటుంబానికి శాంతిని, సహనాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ధర్మేంద్రప్రధాన్‌ ఒడిస్సీలో ట్వీట్‌ చేశారు. మొహంతి ఆయన భార్య తాండ్రా రే, కుమార్తె జాస్మిన్‌తో కలిసి నివసిస్తున్నారు. మొహంతి భార్య తాండ్రా కూడా ఒడియాలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన దండా బలూంగా, నగా ఫాసా, సమయ్ బడా బాలాబన్ వంటి పలు చిత్రాల నటించి చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. 

చదవండి: హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు

మరిన్ని వార్తలు