సినిమాల్లోకి రీఎంట్రీ.. రేణు దేశాయ్‌ గ్రీన్‌సిగ్నల్‌

2 May, 2020 18:50 IST|Sakshi

మహేశ్‌, ప్రభాస్‌ వంటి హీరోలకు తల్లిగా నటిస్తా: రేణు

మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటి, రచయిత, దర్శకురాలు రేణు దేశాయ్‌. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పుణెలో స్థిరపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో అప్పుడప్పుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తున్నారు. అయితే ఓ అభిమాని నుంచి రేణుకు ఊహించని ప్రశ్న ఎదురైంది. సినిమాల్లో రీఎంట్రీ గురించి అడుగుతూనే ప్రభాస్‌, మహేశ్‌లకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగాడు. 

దీనికి రేణు దేశాయ్‌ చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇక ఏ దర్శకుడైన తనను వృద్దాప్య ఛాయలున్న పాత్రలో చూపించగలరనుకుంటే మహేశ్‌ లాంటి స్టార్లకు తల్లిగా నటిస్తానని చెప్పారు. తామంతా నటులమని ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దంగా ఉంటమాని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇక టాలీవుడ్‌లో ఏదైనా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తానని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రేణుదేశాయ్‌కు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.  

‘నాని’ చిత్రంలో దేవయాని మహేశ్‌కు తల్లిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పాత్రలు చేయడానికి రేణు ఆసక్తి చూపిస్తున్నారని సినీ వర్గాల టాక్‌. సినిమాల్లోకి రేణు రీఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె రీఎంట్రీ సినిమా ఏది కాబోతుందో, ఎవరు డైరెక్ట్‌ చేయబోతున్నారో వేచి చూడాలి. ఇక దాదాపు దశాబ్ద కాలం తర్వాత లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’తో సినిమాల్లోకి ఘనమైన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

చదవండి:
‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా