పవన్‌కో రూల్‌ నాకో రూలా?: రేణూ

6 Jul, 2018 14:13 IST|Sakshi
రేణూ దేశాయ్‌ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: గత ఐదేళ్లుగా నాపై వస్తున్న విమర్శలపై ఎందుకు స్పందించలేదని నటి రేణూ దేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్‌కో రూల్‌.. నాకో రూలా? అని  తన ఫేస్‌బుక్‌ పేజీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా తనని అనరాని మాటలు అనడంతో పాటు విమర్శలు చేసిన వారిని పట్టించుకోవద్దని కొందరు సలహా ఇచ్చారని, అయితే మరికొందరు మాత్రం పాపులారిటీ కోసమే రేణు ఇలా చేస్తున్నారని కామెంట్లు చేశారని తెలిపారు. ఇప్పుడేమో పవన్‌కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు ఓ వ్యక్తి కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నాడు. దీంతో కొందరు అభిమానులు పవన్‌కు మద్దతివ్వాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే.. మరికొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని రేణు ఆవేదన వ్యక్తం చేశారు.

‘గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా. ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందన్న భయంతో తనని స్పందించమనడం ఎంత వరకు సబమని’ పవర్‌స్టార్‌ అభిమానులను ఉద్దేశించి ఆమె కామెంట్‌ చేశారు. తానెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడలేదని, అలా మాట్లాడమని తనని కానీ, తన పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదని రేణూ దేశాయ్‌ స్పష్టం చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా