అకీరా సినిమా ఎంట్రీపై రేణు క్లారిటీ

28 Jun, 2020 20:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తన కుమారుడు అకీరా నందన్‌ సినీరంగ ప్రవేశంపై నటి, దర్శకురాలు రేణుదేశాయ్‌ క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం దర్శకురాలిగా బిజీగా ఉన్న రేణు.. ఆదివారం ‘జూమ్‌’ ద్వారా సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆద్య వయస్సు చాలా చిన్నది. తనకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. అకీరా వయసు కూడా ఇప్పుడు 16 ఏళ్ల మాత్రమే. మనకు ఒకటే జీవితం ఉంది.. ఒక మంచి మనిషి ఉండటం చాలా ముఖ్యమని నేను అకీరాకు చెప్తాను. అకీరా ఏ వృత్తి ఎంచుకున్న నేను పూర్తిగా సపోర్ట్‌ చేస్తాను. హీరో కావడం అనేది పూర్తిగా తన ఇష్టం. వాళ్ల నాన్న, పెద్దనాన్న, అన్న హీరోలు అనే ఆలోచనతో తాను కూడా హీరో అయిపోవాలనే ఒత్తిడి తీసుకోవద్దని చెప్తాను. తనకు ఇష్టమైనది చెయ్యమని చెప్పాను. హీరో కావాలని అనుకుంటే అందుకు నా సపోర్ట్‌ ఉంటుంది. ఫ్యామిలీ సినీ ఫీల్డ్‌లో ఉందని కాకుండా.. అతని లోపలి నుంచి ఆ నిర్ణయం రావాలి’ అని తెలిపారు. 

సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతిపై రేణు స్పందిస్తూ.. బంధుప్రీతి అనేది చాలా సున్నితమైన అంశమని తెలిపారు. ప్రతి చోట బంధుప్రీతి అనేది ఉందని.. అది లేదని చెబితే మనం అబద్ధం చెప్పినట్టేనని అన్నారు. తొలి ఒకటి రెండు చిత్రాల వరకే నెపోటిజమ్‌ పనిచేస్తుందని.. ఆ తర్వాత అంతా ట్యాలెంట్‌ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరోవైపు మహేష్‌బాబు సినిమాలో రేణుదేశాయ్‌ నటించబోతున్నారని వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

‘నేను విన్న అతి పెద్ద  బేస్‌లేస్‌ రుమార్‌ ఇది. రెండు మూడు రోజుల నుంచి చాలా మంది నాకు కాల్స్‌‌ చేసి విష్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు ప్రచారం చేసినవారికి హ్యాట్సాఫ్‌. కానీ ఈ సినిమాతో నాకు పూర్తిగా సంబంధం లేదు. ఇంత పెద్ద సినిమా ఒప్పకున్నప్పుడు తప్పనిసరిగా నేను ప్రకటన చేస్తాను. నాకు నటించాలనే ఉంది. గతంలో ఓ సందర్భంలో మదర్‌ రోల్‌ గురించి అడిగినప్పుడు.. హీరో చిన్నప్పటి క్యారెక్టర్‌లకు తల్లిగా చేసేందకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. దాన్ని బేస్‌ చేసుకుని ఎవరో ఇలాంటి వార్తలు సృష్టించారు’ అని రేణు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు