అదొక్కటే దారి..: రేణు దేశాయ్

22 Sep, 2015 20:45 IST|Sakshi
అదొక్కటే దారి..: రేణు దేశాయ్

అసలే ట్రాఫిక్.. ఆపైన హారన్.. ఎంత చిరాకుగా ఉంటుందో కదా. ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తూ కూడా కొంతమంది అదే పనిగా హారన్ మోగిస్తుంటారు. అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. బహుశా రేణు దేశాయ్కి కూడా అలాంటి అనుభవమే ఎదురైనట్టుంది. తన అనుభవాన్ని కాదుగానీ.. ఇదొక్కటే దారి అంటూ ట్విట్టర్లో తనకు తోచిన పరిష్కారాన్ని సూచించారు రేణు. హారన్ బటన్ను పెట్రోల్ ట్యాంకుకు అటాచ్ చేసి.. హారన్ మోగించినప్పుడల్లా ట్యాంకులో ఉన్న ఇంధనం త్వరగా అయిపోయేలా చేయడమే.. ఇండియాలో అనవసరంగా హారన్ మోగించేవారిని ఆపగలిగే ఏకైక పరిష్కారం అంటూ ట్వీట్ చేశారు.

అలాగే..  ఎప్పుడైనా మీకు వృద్ధులుగానీ, పిల్లలు గానీ రోడ్డు దాడుతూ కనిపిస్తే.. జస్ట్ ఒక్కసారి వారిని మీ తల్లిదండ్రులుగా,  పిల్లలుగా ఊహించుకుని దయచేసి మీ వాహనాన్ని ఆపి వారిని రోడ్డు దాటనివ్వండి అంటూ ట్వీట్ చేశారు రేణు దేశాయ్.