'అవి గూగుల్ లో దొరకవు..'

8 Oct, 2015 17:02 IST|Sakshi
'అవి గూగుల్ లో దొరకవు..'

ఈ రోజుల్లో ఏం కావాలన్నా, ఏ విషయం మీద అనుమానం వచ్చినా చేసే మొదటిపని.. గూగుల్ తల్లిని అడగడం. అమ్మను, స్కూల్లో టీచర్లను అడగడం ఎప్పుడో మానేసిన పిల్లలు.. ప్రతి చిన్న విషయానికీ గూగులమ్మ మీదే ఆధారపడుతున్నారు. అయితే గూగుల్లో కొన్నే దొరుకుతాయి.. మిగిలినవి మాత్రం స్కూల్లోనే నేర్పించాలి అంటున్నారు రేణు దేశాయ్. ఇంతకీ అవేంటి.. ఇవేంటి? అనేగా మీ సందేహం. అవి పాఠాలు.. ఇవేమో సుగుణాలు.

పిల్లలకు జువాలజీ, జామెట్రీ లాంటి సబ్జెక్టుల బదులు జాలి, కరుణ, సహనం వంటి సుగుణాలను స్కూల్లో బోధించాలని ఆమె చెప్పారు. ఎందుకంటే పుస్తకాల్లోని పాఠాలు నేర్చుకోవాలంటే మనం గూగుల్ చేయొచ్చు అంటూ ట్వీట్ చేశారు రేణు దేశాయ్.