బంగళాలో మంచి దెయ్యం!

15 Jul, 2016 23:25 IST|Sakshi
బంగళాలో మంచి దెయ్యం!

ఈ లోకంలో చెడ్డ దెయ్యాలు మాత్రమే ఉండవు, మంచి దెయ్యాలు కూడా ఉంటాయంటున్నారు బాలాజీ నాగలింగం. ఆయన సమర్పణలో విసినీ స్టూడియో పతాకంపై వి.లీనా నిర్మించిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఆనంద్ నందా, రష్మీ గౌతమ్ జంటగా నటించారు. డి.దివాకర్ దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బాలాజీ నాగలింగం మాట్లాడుతూ - ‘‘హారర్ కామెడీ చిత్రమిది. ‘రాణిగారి బంగళా’లో మంచి దెయ్యం ఏం చేసింది? ఆ బంగళాలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి? అనేది కథ.

రష్మి సింగిల్ టేక్ ఆర్టిస్ట్. చాలా బాగా నటించింది. భవిష్యత్తులో శ్రీదేవి అంత పేరు తెచ్చుకుంటుందామె. సీనియర్ నటులు శివకృష్ణ కాటి కాపరి పాత్రలో కనిపిస్తారు. చిత్రంలో రెండే పాటలున్నాయి. ‘ప్రేమకథా చిత్రమ్’ దర్శకుడు ప్రభాకర్‌రెడ్డి ఛాయాగ్రహణం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. కాశీ విశ్వనాథ్, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వి.లీనా, సహ నిర్మాత: శ్రీనివాసరావు, సంగీతం: ఈశ్వర్ పేరవల్లి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి