వర్మ కొత్త సినిమా‌: పవర్‌ స్టార్‌ ఇతనే

28 Jun, 2020 12:06 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బయోపిక్‌ల రారాజు.. వివాదాల చక్రవర్తి రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలన బయోపిక్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘పవర్‌ స్టార్‌’ సినిమా చేయనున్నట్లు  ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘ బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవటానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని పేర్కొన్నారు. (ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్‌ వైరల్‌)

అనంతరం ‘పవర్‌ స్టార్‌’లో పాత్రధారికి సంబంధించిన ఓ వీడియోను  విడుదల చేశారు. ‘నా కొత్త సినిమా ‘పవర్‌ స్టార్‌’లో హీరో ఇతనే. అతడు మా ఆఫీస్‌ వద్దకు వచ్చినపుడు ఈ వీడియోను చిత్రీకరించాం. ఏ వ్యక్తినైనా పోలిన వ్యక్తులు ఉండటం యాధృచ్చికం కాని యాధృచ్చికం.. ఉద్ధేశ్యపూర్వకం కాని ఉద్ధేశ్యపూర్వకం’’ అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చారు.

>
మరిన్ని వార్తలు