ఆర్జీవీ... ఓ రామబాణం

2 Apr, 2020 00:34 IST|Sakshi
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు,

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆర్జీవీ’. ‘కార్తికేయ’ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం, టారస్‌ సినీకార్ప్‌ సమర్పణలో మాగ్నస్‌ సినీప్రైమ్‌ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ సినిమా నిర్మించనున్నారు. నేడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్జీవీ’ చిత్రం టైటిల్‌ లోగో విడుదల చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడదోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన రామబాణమే ఈ సినిమా. అందుకే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్‌ లోగో విడుదల చేశాం’’ అన్నారు. ‘‘కరోనా వైరస్‌  ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం. సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: వేదాంత్‌ మల్లాది, సంగీతం: వీణాపాణి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా