చ‌స్తావా? లేదా చంప‌మంటావా?

16 Jul, 2020 14:25 IST|Sakshi

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంతో ఎంద‌రో సెల‌బ్రిటీలు ముఖ్యంగా ఖాన్‌, క‌పూర్ కుటుంబాల‌పై అభిమానులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ బాధితుల లిస్టులో ఇప్పుడు రియా చ‌క్ర‌వ‌ర్తి కూడా చేరిపోయారు. ఈమె సుశాంత్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉంది. ఆమె సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రెండు రోజుల క్రితం ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. 'నువ్వు దూర‌మై నెల‌రోజుల‌వుతోంది. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని రాసుకొచ్చారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం సుశాంత్ చావుకు రియా కూడా కార‌ణ‌మంటూ మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. (అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!)


"నిన్ను క‌చ్చితంగా అత్యాచారం చేసి చంపేస్తాం. కాబ‌ట్టి నీ అంత‌ట నీవుగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం మంచిది. లేక‌పోతే మేమే నిన్ను చంపేస్తాం" అంటూ బెదిరిస్తూ మెసేజ్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను రియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "న‌న్ను గోల్డ్ డిగ్గ‌ర్ అన్నారు, స‌హించాను.. హంత‌కురాల‌ని నిందించారు.. భ‌రించాను, సిగ్గు లేద‌ని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని, లేక‌పోతే అత్యాచారం చేసి చంపేస్తాన‌ని బెదిరించే హ‌క్కు మీకెక్క‌డిది? అది ఎంత పెద్ద నేర‌మో మీకైనా అర్థ‌మ‌వుతోందా? ఇలాంటి దుర్మార్గమైన బెదిరింపుల‌కు ఎవ‌రూ పాల్ప‌డ‌వ‌ద్దు. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇక జరిగింది చాలు.. ఆపేయండి" అని పోస్ట్ చేశారు. త‌న‌పై బెదిరింపు వ్యాఖ్య‌లు చేసిన ‌వారిపై చ‌ర్య‌లు తీసుకోండంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ట్యాగ్ చేశారు. (జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌)

I was called a gold digger ..I kept quiet I was called a murderer ....I kept quiet I was slut shamed ....I kept quiet But how does my silence give you the right to tell me that you will get me RAPED and MURDERED if I don’t commit suicide @mannu_raaut ? Do you realize the seriousness of what you have said? These are crimes, and by law no one, I repeat NO ONE should be subjected to this kind of toxicity and harassment . I request @cyber_crime_helpline @cybercrimeindia to please take necessary action . ENOUGH IS ENOUGH

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా