‘సుశాంత్‌ మృతికి కారణం తెలియాలి’

16 Jul, 2020 16:14 IST|Sakshi

అమిత్‌ షాకు రియా చక్రవర్తి వినతి

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ మరణంపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తుండగా, తాజాగా సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి ఈ కేసుపై అత్యున్నత దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్‌ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని హోంమంత్రి అమిత్‌ షాకు ఆమె బుధవారం సోషల్‌ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. హోంమంత్రిని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్‌లో’ సుశాంత్‌ అనూహ్యంగా మనకు దూరమై ఇప్పటికి నెలరోజులు దాటింది..నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది..న్యాయాన్ని నిలబెట్టేందుకు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా’నని పేర్కొన్నారు. సుశాంత్‌ ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ను ముగించారు.

కాగా ఓ ఇన్‌స్టాగ్రాం యూజర్‌ తనపై లైంగిక దాడి జరిపి చంపేస్తానని బెదిరిస్తున్నాడని అంతకుముందు ఆమె ఆ మెసేజ్‌ స్ర్కీన్‌షాట్‌ను షేర్‌ చేశారు. "న‌న్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, స‌హించాను.. హంత‌కురాల‌ని నిందించారు.. భ‌రించాను, సిగ్గు లేద‌ని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మహ‌త్య చేసుకోవాల‌ని, లేక‌పోతే అత్యాచారం చేసి చంపేస్తాన‌ని బెదిరించే హ‌క్కు మీకెక్కడిది? అని ప్రశ్నించారు. త‌న‌పై బెదిరింపు వ్యాఖ్య‌లు చేసిన ‌వారిపై చ‌ర్యలు తీసుకోండంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ట్యాగ్ చేశారు. సుశాంత్ చావుకు రియా కూడా కార‌ణ‌మంటూ కొంద‌రు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపుల‌కు పాల్పడుతున్నారు. చదవండి : ప్రశాంతంగా ఉండు సుశీ...

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా