ఆ స్టార్‌ ప్రేమజంట పెళ్లి వాయిదా!

19 Mar, 2020 19:14 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ప్రేమజంట రిచా చద్దా- అలీ ఫజల్‌ వచ్చే నెల జరగాల్సిన తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2020 చివరి నాటికి మరోసారి పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) పంజా విసురుతున్న నేపథ్యంలో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ‘‘అంటువ్యాధి కోవిడ్‌-19 ప్రబలుతున్న తరుణంలో  అలీ ఫజల్‌, రిచా చద్దా తమ వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్‌ చివరి వారంలో వివాహం చేసుకునేందుకు రిచా, అలీ కోర్టు నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇక ‘ఫక్రీ రిటర్న్స్‌’లో జంటగా నటించిన వీరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. రిచా పంజాబీ అమ్మాయి కాగా.. అలీది ఉత్తర్‌ప్రదేశ్‌.(హీరో నితిన్‌ పెళ్లి వాయిదా..!)

ఇక కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా చిన్ననాటి స్నేహితురాలు నటాషాతో డేటింగ్‌ చేస్తున్న ఈ హీరో పెద్దలను ఒప్పించి డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేసినట్లు అతడి సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. తొలుత థాయ్‌ల్యాండ్‌లోని ప్రైవేటు ద్వీపంలో పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేదికను జోధ్‌పూర్‌కు, ఆ తర్వాత ముంబైకి మార్చుకున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వాయిదా వేశారని పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి భారత్‌లో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: హీరో)

‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు