నేనూ అలాగే ఉంటా!

2 Dec, 2018 06:11 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీస్‌ ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, దీపికా పదుకోన్‌లు యాక్టింగ్‌ను ప్లాన్‌ ఏ గా భావించి ప్లాన్‌ బీగా నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఇప్పుడీ జాబితాలోకి మరో నటి రిచా చద్దా చేరారు. ఆమె కూడా ప్లాన్‌ బీగా ప్రొడక్షన్‌ హౌస్‌ను స్టార్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. ‘‘ఒక్క యాక్టింగ్‌ పరంగానే కాదు వీలైనన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో నేను భాగం అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా మారే అవకాశం వచ్చింది. న్యూయార్క్‌కి చెందిన నా క్లోజ్‌ ఫ్రెండ్‌ సుచంటి తలాటి ఓ టీనేజ్‌ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ఆమె నన్ను ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేయమని అడిగినప్పుడు నిర్మాతగా నాకు ఇదొక అవకాశంగా కనిపించింది. ఈ రోజుల్లో అందరూ ఒక్క పనితోనే ఆగిపోవడం లేదు. మల్టిఫుల్‌ వర్క్స్‌ చేస్తున్నారు. నేనూ అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు. ప్రస్తుతం షకీల బయోపిక్‌ ‘షకీల’లో ఆమె æనటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు