16 Jan, 2019 12:01 IST|Sakshi

రానా హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తరువాత మిరపకాయ్‌, మిర్చి సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌ అనిపించుకున్నారు. కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే భాయ్‌ సినిమా తరువాత నటనకు బ్రేక్‌ ఇచ్చి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయారు.

ఆ తరువాత అభిమానులకు దూరమైన ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పారు. తనకు బిజినెస్‌ స్కూల్‌లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నారు.


మరిన్ని వార్తలు