రిచర్డ్స్ ప్రామిస్!

13 Mar, 2015 02:53 IST|Sakshi
రిచర్డ్స్ ప్రామిస్!

ఎంగేజ్‌మెంట్‌కు నాన్న రాలేదని అలిగిన మసబా గుప్తాకు పెద్ద ఊరటే లభించింది. నవంబర్‌లో జరిగే పెళ్లికి తప్పకుండా వస్తానని హామీ ఇచ్చి కుమార్తె మోములో వెలుగులు పూయించాడు వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్, మసాబా తండ్రి వివియన్ రిచర్డ్స్! వెటరన్ నటి నీనాగుప్తా, రిచర్డ్స్‌ల కూతురైన మసాబా ఫ్యాషన్ డిజైనర్. ఫిల్మ్ ప్రొడ్యూసర్ మధు మంతెనతో ముంబైలో రీసెంట్‌గా ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అలియాభట్, సిద్ధార్థ్ మల్‌హోత్రా, హ్యుమా ఖురేషి తదితర బాలీవుడ్ ప్రముఖులు, క్లోజ్ ఫ్రెండ్స్ ఈ అకేషన్‌కు అటెండయ్యారు.

రిచర్డ్స్ మాత్రం మిస్సయ్యాడు. అయితే రిచర్డ్స్, ఆయన సతీమణి మిరియమ్ స్పీచ్‌తో ప్రదర్శించిన ఏవీ ఫంక్షన్‌లో ఉన్నవారందర్నీ టచ్ చేసింది. మసాబాను తొలిసారి కలిసి హగ్ చేసుకున్న మిరియమ్... ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది. ఆమె తనకు మంచి ఫ్రెండని చెప్పింది. పెళ్లి తరువాత కుమార్తె అత్తింటికి వెళ్లిపోతే తాను ఒంటరినైపోతానంటూ నీనాగుప్తా కంటతడి పెట్టుకుంది. భర్తను రిటైర్‌మెంట్ తీసుకుని తనకు తోడుగా ఇంట్లోనే ఉండమని కోరిందట! మొత్తానికి మసాబా ఎంగేజ్‌మెంట్ పక్కా సెంటిమెంట్ సినిమాలా మారి... అతిథుల హృదయాలను ద్రవింపజేసింది!