బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం!

13 Jul, 2020 16:10 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే బచ్చ‌న్ కుటుంబంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. అంతేకాకుండా ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ మిన‌హా మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ నేప‌ధ్యంలో ముంబైలోని ప‌లువురు ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకిన‌ట్లు ప‌లు వ‌దంతులు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌పూర్ ఫ్యామిలీకి కూడా క‌రోనా సోకింద‌ని, ఇప్ప‌టికే నీతూ క‌పూర్, ర‌న్‌బీర్ క‌పూర్‌ల‌కు కోవిడ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌లపై రిద్ధిమ క‌పూర్ స్పందించారు. తామంతా ఫిట్‌గా ఉన్నామ‌ని ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేయోద్ద‌ని కోరింది. అటెన్షన్ కోసం ఇలాంటి వార్త‌లు రాస్తారా అంటూ రిద్ధిమ ఫైర్ అయ్యారు. రిద్ధిమ ఏర్పాటు చేసిన పుట్టిన‌రోజు పార్టీకి అమితాబ్ మ‌నువ‌డు అగ‌స్థ్య నందా  వెళ్లార‌ని, ఆయ‌న ద్వారానే బ‌చ్చ‌న్ కుటుంబ‌ సభ్యుల‌కు క‌రోనా వ‌చ్చిందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. 
(వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది: వైద్యులు)

Attention seeking ??? Least verify/ clarify ! We are fit We are good ! Stop spreading rumours ! #lunatics #fakenews

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

మ‌రోవైపు ప్రముఖ న‌టి, బీజేపీ ఎంపీ హేమ‌మాలిని ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు వ‌దంతులు వ‌చ్చాయి. దీంతో తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ఆమె ట్విటర్ ద్వారా వీడియోను పోస్ట్ చేశారు. (ఆరోగ్యంపై పుకార్లు.. స్పందించిన సీనియర్‌ నటి)  కొన్ని రోజల క్రితం నీతూ క‌పూర్ 62వ పుట్టినరోజు సంద‌ర్భంగా రిద్ధిమ క‌పూర్ పార్టీ నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో క‌పూర్ ఫ్యామిలీ స‌హా అగ‌స్థ్య నందా, నితాషా నంద, క‌ర‌ణ్ జోహార్ స‌హా ప‌లువురు పాల్గొన్నారు.

The richest are the ones with good relationships!!! We all need love ,support strength from our loved ones always 💕💕💕💕I feel the richest today 🤗🤩

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు