లుకేమియా వ్యాధి లక్షణాలు తెలుసా!

30 Apr, 2020 18:06 IST|Sakshi
రిషి కపూర్‌ (ఫైల్‌)

బాలీవుడ్‌ నటుడు రిషి కపూర్‌ క్యాన్సర్‌తో పోరాడి గురువారం మృతి చెందారు. గత రెండేళ్లుగా లుకేమియా వ్యాధితో బాధపుడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆసుపత్రిలో ప్రశాంత మరణాన్ని పొందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. క్యాన్సర్ల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. అసలు లుకేమియా అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? (రిషి క‌పూర్ లాస్ట్ ట్వీట్ అదే..)

లుకేమియా అంటే ఏమిటి?
సాధారణంగా దీన్ని  బ్లడ్‌క్యాన్సర్‌ అంటుంటారు. మన శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య అధిక సంఖ్యలో ఉత్పత్తి కావడం వల్ల లుకేమియా వస్తుంది. ఎందుకంటే తెల్ల రక్త కణాలు ఉండాల్సిన సంఖ్య కంటే అధిక సంఖ్యలో ఉంటే అవి ఎర్ర రక్త కణాలను, ప్లేట్‌లేట్స్‌ ఉత్పత్తి తగ్గిస్తాయి. మన శరీరానికి అవసరమైనన్ని ఎర్రరక్తకణాలను ఉత్పత్తి జరగకుండా వాటిని బలహీన పరుస్తాయి. అవి బలహీన పడటం వల్ల ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి తగ్గి రక్తకణజాలల్లో కణుతులు ఏర్పడటమే కాకుండా ఎముక మజ్జలో కూడా కణుతులు ఏర్పడతాయి. ఇవే లుకేమియాకు దారిస్తాయి. దీనివల్ల శరీరంలో శక్తి సామర్థ్యం తగ్గి రోజుకు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్‌ కుమారుడు)

లుకేమియాలో రకాలు..
లుకేమియాల్లో చాలా రకాలున్నా, వాటిలో తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి... అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా, క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా. అయితే కొన్నిసార్లు ఇతర క్యాన్సర్లు ఎముక మజ్జలోకి వ్యాపించే అవకాశం ఉన్న ఉన్నా అవి లుకేమియాలు కావని గ్రహించాలి.

లక్షణాలు
లుకేమియా బారిన పడిన వ్యక్తులు శరీర ఆరోగ్యాన్ని బట్టి కొంత మంది వేగంగా, నెమ్మదిగా ప్రభావం చూపుతుంది.  వేగంగా పెరిగే లుకేమియా రోగులకు అలసట, బరువు తగ్గడం, తరచూ అంటువ్యాధులు, సులభంగా రక్తస్రావం లేదా గాయాలు వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ​నెమ్మదిగా పెరిగా లుకేమియా రోగులలో చాలా మందికి ఈ లక్షణాలు తక్కువగా కనిపించవు. ఇక లుకేమియాతో బాధపడే వారికి ఎముకలు, కీళ్లలో నొప్పి ఉంటుంది. మైకం, జ్వరం, ఆకలి లేకపోవడం, నోటిలో పుండ్లు, పల్లర్‌, చర్మంపై ఎర్రటి మచ్చలు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, వాపు శోషరస కణుపులు, అనుకోకుండా బరువు తగ్గడం, బలహీనత వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. 

చికిత్స
లుకేమియాకు సాధారణ చికిత్సగా కీమోథెరపీను ఇస్తారు. కొన్ని సందర్భాల్లో కీమోథెరపీతో పాటు రేడియోథెరపీ, మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీ, ఇమ్యునోథెరపీని ఇస్తారు. ఇవి పని చేయని పక్షంలో ఎముక మజ్జ మార్పడి చికిత్సను చేయాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు