ప్రముఖ నటుడు రిషీకపూర్‌ కన్నుమూత

30 Apr, 2020 09:39 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు రిషీకపూర్‌ (67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడటంతో రిషి కపూర్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ చేర్పించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్‌ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.  కాగా రిషీకపూర్‌ మృతిపై అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు రిషీకపూర్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. అలాగే విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. (వీ ఆల్ సో లవ్ యూ)

1952, సెప్టెంబర్‌ 4న ముంబైలో జన్మించిన రిషీకపూర్‌ మేరా నామ్‌ జోకర్‌ చిత్రంలో బాల నటుడుగా  ‘బాబీ’ చిత్రంతో హీరోగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు.  మేరానామ్ జోకర్, బాబీ, జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ చిత్రాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. రిషీ కపూర్‌కు భార్య నీతూ కపూర్,పిల్ల‌లు రిద్దిమా క‌పూర్, ర‌ణ్‌భీర్ క‌పూర్ ఉన్నారు. 1980లో హీరోయిన్‌ రీతూకపూర్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా దర్శక, నిర్మాతగా రాణించిన ఆయన పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.  (ప్రియమైన మిత్రులారా.. శత్రువులారా...)

మరిన్ని వార్తలు