చిన్ననాటి ఫోటో పంచుకున్న నటుడు

14 Nov, 2019 12:10 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రిషీకపూర్‌ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేస్తూ.. తన అభిమనులను అలరిస్తూ ఉంటారు. రిషీ.. విలక్షణమైన పాత్రలతో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రిషీ తన చిన్ననాటి ఫోటోను ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో ఉన్నవారంతా తన పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సోదరులు.. బోని కపూర్‌, అనిల్‌ కపూర్‌, అదిత్య కపూర్‌, టూటూ శర్మలుగా పేర్కొన్నారు. వీరంతా పుట్టిన రోజు వేడుకల్లో కూల్‌డ్రింక్‌ కోకాకోలా తాగుతున్నట్టు కనిపిస్తున్నారు. రిషీ కొంటెగా తన పక్కన ఉన్న సోదరున్ని కొడుతున్నట్టు, అతని చేతిలో ఏదో ఉంటే.. లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ ఫోటోకి ‘ఒరిజినల్‌ కోకా కోలా ప్రకటనలో.. బోని కపూర్‌, ఆదిత్య కపూర్‌, రిషికపూర్‌, టూటూ శర్మలతోపాటు, క్యూట్‌ అనిల్‌ కపూర్‌’ ఉన్నారంటూ రిషీ కామెంట్‌ పెట్టారు.

రిషీ కపూర్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘అద్భుతం రిషీజీ.. ఇది అరుదైన ఫోటో, ఇలాంటివి మరికొన్ని ఫోటోలు పోస్ట్‌ చేయండి’ అని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. ‘మీరు చాలా ముద్దుగా ఉన్నారు. కొన్ని సార్లు మా అల్లుడిని ‘రిషీ కపూర్‌’ అని పిలుచుకుంటాము’ అని మరో అభిమాని కామెంట్‌ చేశారు.

రిషీ కపూర్‌ తాను నటించిన ‘దూస్రా ఆద్మీ’ విడుదలై  42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ సినిమాకి సంబంధించిన అలనాటి ఓ ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ ఫోటోకి ‘ప్రీమియర్‌ ఆఫ్‌ దూస్రా  ఆద్మీ’ అని కామెంట్‌ పెట్టారు. ఈ ఫోటోలో రిషీ కపూర్‌, యాశ్‌చోప్రా, దర్శకుడు రమోశ్‌ తల్వార్‌ ఉన్నట్టుగా  పేర్కొన్నారు. ఈ సినిమా 1977 అక్టోబర్‌14న విడుదలై  భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 11 నెలల తర్వాత రిషీ కపూర్‌ కేన్సర్‌ చికిత్స పూర్తి చేసుకొని న్యూయార్క్‌ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా