ఆ సంస్థ విమానాలు ఎక్కడం మానేయండి!

10 Aug, 2018 16:40 IST|Sakshi

జాతి వివక్ష ఎక్కడ ఉన్న తప్పుబట్టాల్సిందే. జాత్యహంకారం ఈ మధ్య కాలంలో మితి మీరిపోతోంది. తాజాగా జాత్యాహంకారాన్ని ప్రదర్శించిన బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సంస్థపై బాలీవుడ్‌ నటుడు రిషీ కపూర్‌ మండిపడ్డారు. తనకు గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘లండన్ విమాన ఘటన గురించి తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. విమానంలోని భారతీయుల్ని దించేయడం సరికాదు. ఇది జాతి వివక్షే. గతంలో నేను ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినప్పటికీ..  రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ సంస్థ విమానాలను ఎక్కడం మానేశాను. మనకు గౌరవం ఇవ్వని ఇలాంటి విమానాలను ఇకపై ఎక్కడం మానేయండి. జెట్ ఎయిర్ లేదా ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణించండి. అక్కడ గౌరవం దక్కుతుంది’ అని ట్వీట్‌ చేశారు. 

జూలైలో ఓ ఇండియన్‌ ఫ్యామిలీ లండన్‌ నుంచి బెర్లిన్‌కు వెళ్లడానికి బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సర్వీస్‌ విమానంలో టికెట్స్‌ బుక్‌ చేసుకున్నారు. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న బాలుడు ఏడ్వడంతో అక్కడి సిబ్బంధి వారిని దూషించి అక్కడే దించేశారు. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై రిషీ కపూర్‌ పైవిధంగా స్పందించారు. 

మరిన్ని వార్తలు