రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!

6 Dec, 2014 15:50 IST|Sakshi
రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!

ముంబై:బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల  జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట తీవ్రంగా చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు.

 

తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.