ఎల్‌కేజీ హీరో

20 May, 2018 01:26 IST|Sakshi
ఆర్జే బాలాజీ

‘ఎల్‌కేజీ’ జాయిన్‌ అయ్యారు ఆర్జే బాలాజీ. మూడు పదుల వయసు తర్వాత ఆయన ‘ఎల్‌కేజీ’లో జాయిన్‌ అవ్వడం ఏంటీ? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అది సినిమా పేరు. రేడియో జాకీగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి టీవీ ప్రజెంటర్, హాస్య నటుడిగా ఎదిగిన బాలాజీ ఇప్పుడు హీరోగా కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రభు దర్శకునిగా పరిచయం అవుతూ ఆర్జే బాలాజీ హీరోగా నటించనున్న చిత్రం ‘ఎల్‌కేజీ’. ఇందులో ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటించనున్నారు. శుక్రవారం ‘ఎల్‌కేజీ’ చిత్రాన్ని ఎనౌన్స్‌ చేశారు. ఈ సినిమా పొలిటికల్‌ సెటైరికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని కోలీవుడ్‌ టాక్‌. ఇందులో హీరోగా నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే ఆర్జే బాలాజీనే అందించనుండటం విశేషం. ఈ సినిమాకు లియాన్‌ జేమ్స్‌ బాణీలు సమకూర్చనున్నారు. మూవీ టైటిల్‌ను బట్టీ ‘ఎల్‌కేజీ’ అనేది సినిమాలో ఓ పొలిటికల్‌ పార్టీ కూడా అయ్యి ఉండవచ్చన్నది కొందరి ఊహ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు