రోబో: హీరోయిన్‌ ఐశ్వర్య.. మరి హీరో ఎవరు?

11 Apr, 2020 11:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ సృష్టించిన అద్భుత సృష్టి ‘రోబో’ . రజనీ సరసన అందాల తార ఐశ్వర్యరాయ్‌ నటించారు. విజువల్‌ వండర్‌గా నిలిచిన చిత్రం మరెన్నో చిత్రాలకు ప్రేరణగా నిలిచింది. సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలై పదేళ్లు కావస్తోంది. మలేషియాలో జరిగిన ‘రోబో’ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్‌ స్పీచ్‌ అందరినీ నవ్వుల్లో ముంచెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్‌ అయింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అనేక పాత, కొత్త విషయాలను తెలుసుకుంటున్న నెటిజన్లకు రజనీకి సంబంధించిన ఈ పాత వీడియో కంటపడింది. దీంతో పూర్తి వినోదత్మకంగా ఉన్న ఆ వీడియోను తెగ లైక్‌ చేస్తుండటంతో మరోసారి వైరల్‌ అవుతోంది. ఆ విశేషాలు మీకోసం..

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?
‘నేను ఒక రోజు బెంగళూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లాను. ఆ ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న నందూలాల్ అనే ఓ 60 ఏళ్ల వ్యక్తి నన్ను చూసేందుకు వచ్చాడు. అప్పుడు ఈ విధంగా మా మధ్య సంభాషణ జరిగింది.

నందులాల్‌: ఏంటయ్యా రజనీ, మీ జుట్టుకు ఏమైంది.
రజనీ: రాలిపోయింది సర్‌. అయినా ఇప్పుడు దీని గురించి ఎందుక లేండి?
నందులాల్‌: మీరు రిటైర్‌ అయ్యాక ఏం చేస్తున్నారు?
రజనీ: నేను రిటైర్‌ కాలేదు. సినిమాల్లో నటిస్తున్నాను
నందులాల్‌: అవునా? ఏ సినిమా
రజనీ: రోబో, ఐశ్వర్యరాయ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు
నందులాల్‌: ఐశ్వర్యరాయ్‌ది ఏం అందం అండి, ఇంతకీ ఆ చిత్రంలో హీరో ఎవరు?
రజనీ: హీరో నేనే (చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే)
నందులాల్‌: ఓ పది నిమిషాలు తదేకంగా నన్ను చూసి, మీరు హీరోనా?

వెంటనే ఆయన కుమారులు వచ్చి నాన్న రజనీకాంత్‌ ఇప్పటికే హీరో పాత్రలలోనే నటిస్తున్నారు అని చెప్పారు. అయితే నందులాల్‌ వాళ్ల ఇంటికి వెళ్లాక ఆయన కుమారులతో ఇలా అన్నారంట. అరేయ్‌ ఐశ్వర్యరాయ్ కి అసలు ఏమైంది? అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లి పోయాడు? అమితాబచ్చన్ ఏం చేస్తున్నాడు? బట్టతల ఉన్న రజినీకాంత్ కి ఐశ్వర్య రాయ్ తో నటించే అవకాశం ఎలా వచ్చింది? అంటూ ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఐశ్వర్యకు ఒక్కటి చెప్పదల్చుకున్నాను. నా పక్కన హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పుకున్న ఐశ్వర్యకు కృతజ్ఞతలు’ అంటూ రజనీ పేర్కొనడంతో ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన వారందరూ పగలబడి నవ్వుకున్నారు. 

చదవండి:
కరోనాపై పోరులో చిరంజీవి తల్లి
డీడీ నంబర్‌ వన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా