జబర్దస్త్‌ నటులకు భక్తి గ్రంథాన్ని అందించిన రోజా

9 Oct, 2019 21:18 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన షో ‘జబర్దస్త్‌’. అయితే దసరా సందర్భంగా జరిగిన జబర్దస్త్‌ షూటింగ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా.. జబర్దస్త్‌ నటులకు ‘శ్రీ పూర్ణిమ’  భక్తి గ్రంథాన్ని దసరా కానుకగా అందజేశారు. ఈ బుక్‌ అందుకున్న వారిలో అప్పారావు, రాకేశ్‌, సుధాకార్‌, ఆది, రాఘవ, చంటి, రాజు తదితరులు ఉన్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రచించిన ఈ గ్రంథానికి రోజా ప్రచురణకర్తగా వ్యవహరించారు. 

అయితే శ్రీనివాస్‌ గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవి చేపట్టారు. శ్రీశైలం క్షేత్రానికి కూడా ప్రత్యేక సలహాదారుడిగా వ్యవహరించారు. రోజా సమర్పించిన ఈ గ్రంథంలో శ్రీనివాస్‌.. తనకు ఆత్మ బంధువులైన వారాహి చలనచిత్ర అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల పేర్లను కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటించారు. ఈ గ్రంథానికి విశేష స్పందన లభిస్తోంది. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, యాదాద్రి మొదలుకొని.. పలు మహా శైవ వైష్ణవ ఆలయాల అర్చకులకు, వేద పండితులకు, వేదపాఠశాలలకు రోజా స్వయంగా ఈ గ్రంథాన్ని సమర్పించారు. దీంతో వారు రోజాను ప్రశంసించారు. తాజాగా దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ‘శ్రీ పూర్ణిమ’ గ్రంథాన్ని అందించడంతో జబర్దస్త్‌ నటులు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి రోజా.. అమ్మవారి అనుగ్రహంతో ఈ బుక్ ఇస్తున్నానని, ఖాళీ సమయాల్లో ప్రార్థనకై ఇది చాలా ఉపయోగపడుతుందని వారికి బదులిచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా