నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది

11 Oct, 2014 23:34 IST|Sakshi
నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ : ఆది

 ‘ప్రేమ, వినోదం, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే సినిమా ఇది. నాకిది ఫస్ట్ యాక్షన్ మూవీ. ముందు రామ్‌చరణ్, బన్నీ అనుకుని దర్శకుడు నాతో ఈ సినిమా చేశారు’’ అని ఆది చెప్పారు. ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాధవరం నిర్మిస్తున్న ‘రఫ్’ చిత్రం టీజర్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘సుబ్బారెడ్డి నాతో కలిసి చాలాకాలం పనిచేశారు. స్వతహాగా ఆయన చాలా రఫ్.
 
  ఈ సినిమాతో ఆదిని ఓ స్థాయికి తీసుకెళ్తాడనే నమ్మకముంది’’ అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ -‘‘సురేందర్‌రెడ్డి సినిమాతోనే ఆది పరిచయం కావాల్సింది. కానీ మిస్సయ్యింది. చిరంజీవికి ‘ఖైదీ’, నాకు ‘పోలీస్ స్టోరీ’ ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చిందో, ఆదికి ఈ సినిమా అంత పేరు తెస్తుందనే నమ్మకముంది’’ అని చెప్పారు. ఆది ఈ సినిమా కోసం చాలా శ్రమించాడని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, టీమ్‌వర్క్‌తో ఈ సినిమా చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. రాజ్‌కుమార్, బిఏ రాజు, అరుణ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా