ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచానికి స్వాగతం

30 Jan, 2020 00:15 IST|Sakshi
రామ్‌చరణ్, అజయ్‌ దేవగన్, ఎన్టీఆర్, రాజమౌళి

రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలు. ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ మధ్యే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్లో అడుగుపెట్టారు అజయ్‌. లొకేషన్లో అజయ్‌ దేవగన్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కలిసి దిగిన ఫోటో ఒకటి బయటికొచ్చింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అజయ్‌సార్‌’’ అన్నారు ఎన్టీఆర్‌. ‘‘మీ పని అంటే నాకు ఇష్టం. వ్యక్తిగా అంతకంటే ఇష్టం అజయ్‌సార్‌’’ అన్నారు చరణ్‌. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇందులో  కొమరమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు